- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మొత్తం 1,44,300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. అందులో 1,24,495 మంది విద్యార్థులు తమ దరఖాస్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా 1,15,845 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,088 కళాశాలల్లో 4,68,880 డిగ్రీ సీట్లు అందబాటులో ఉన్నాయి.
- Advertisement -