Sunday, January 19, 2025

మిడ్ మానేరు నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్లు

- Advertisement -
- Advertisement -

మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్మాణంతో 12గ్రామాలకు చెందిన నిర్వాసితులు 10,683మందికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇండ్లను మంజూరీ చేయాల్సి ఉంది. గతంలో 5,987మందికి ఇండ్లను నిర్మింపచేయగా, మిగిలిన 4,696మందికి తాజాగా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద స్టేట్ రిజర్వ్ కోటాలో నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.5లక్షల చొప్పున మంజూరు చేసింది. వెంటనే ఇళ్ల్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీకి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఆర్‌అండ్ బీ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో నిర్వాసితులు గత ప్రభుత్వ హయాం నుండి పునరావాసం కింద ఇళ్లను మంజూరు చేయాలని పడుతున్న ఎదురుచూపులు ఫలించినట్లయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News