Monday, December 23, 2024

దాపేట్టేది ఏమి లేకుంటే… జెపిసికి అనుమతించండి: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మీద దర్యాప్తు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)ని వేయడానికి బిజెపి ప్రభుత్వం వెనుకడుగువేస్తోందని కాంగ్రెస్ మంగళవారం తెలిపింది. అమిత్ షా చెప్పినట్లు దాపెట్టిది ఏదీ లేకుంటే, భయంలేకుంటే అనుమతించమని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ మాట్లాడుతూ జెపిసి వేయడానికి బిజెపి భయపడి పారిపోతోంది అన్నారు. పార్లమెంటులో అదానీకి సంబంధించిన ప్రతివిషయాన్ని దాటవేసిందన్నారు.

కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంటులోనే జెపిసికి డిమాండ్ చేశారు. ‘వారు దాపేట్టేది ఏమిలేకుంటే మా నాయకులు కోరే జెపిసి విచారణకు అనుమతించాలి’ అని జైరామ్ రమేశ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రైవెటైజేషన్ పేరిట గత ఎనిమిది తొమ్మిదేళ్లలో ప్రభుత్వం నుంచి అదానీ కంపెనీలు మాత్రమే లాభపడ్డాయని అన్నారు. పార్లమెంటులో మెడీ, అదానీలపై రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి ఆయన క్షమాపణ చెప్పరన్నారు. ఆయన ఏమి తప్పుచేయలేదన్నారు. పార్లమెంటరీ రికార్డుల నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అన్న మాటలను కూడా తొలగించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News