Thursday, November 14, 2024

టీకా తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డిమాండ్‌కు తగ్గట్టు టీకా తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీల వైస్‌ ఛాన్సలర్లతో వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేటెంట్ హక్కుదారులకు 10 శాతం రాయల్టీ చెల్లించే విధంగా ప్రాణాధార ఔషధాలను ఉత్పత్తి చేసేందుకు మరిన్ని కంపెనీలను అనుమతించే విధంగా చట్టం తేవాలని ప్రధాని మోడీకి తాను విజ్ఞప్తి చేయనున్నట్టు ఆయన చెప్పారు. వ్యాక్సిన్ సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటే సమస్య తలెత్తుతుందని ఒకటికి బదులు మరో పది కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేసి అనుమతించాలని ఆయన సూచించారు. తయారైన వ్యాక్సిన్‌ను దేశంలో సరఫరా చేసి అప్పటికీ మిగులు ఉంటే ఎగుమతులు చేయవచ్చని ఆయన సూచించారు. ఆత్మ నిర్బర్ భారత్‌ను తాము కోరుకుంటున్నామని, దేశం లోని అన్ని జిల్లాలు మెడికల్ ఆక్సిజన్ విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పారు.

Allows more firms for make Vaccine: Nitin Gadkari

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News