- Advertisement -
నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి పుష్ప సినిమా టీమ్ భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. బుధవారం కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రేతేజ్ ను నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి పరామర్శించారు. ఇప్పటికే ఓసారి బాలుడిని వీరి పరామర్శించారు. తాజాగా మరోసారి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారాన్ని ప్రకటించారు. ఇందులో అల్లుఅర్జున్ రూ.కోటి, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తరుపున మరో రూ.50లక్షలు ఇచ్చారు.
- Advertisement -