Friday, December 20, 2024

Cenima: ‘విడుదల’ చాలా గొప్ప చిత్రం

- Advertisement -
- Advertisement -

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‘ ద్వారా తమిళ చిత్రం ‘విడుతలై పార్ట్ 1’ తెలుగు వర్షన్ ‘విడుదల పార్ట్ 1’గా ఏప్రిల్ 15న విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా మీడియా ప్రతినిధులకు ఈ చిత్రాన్ని ప్రదర్శించి ‘విడుదల’ చిత్ర బృందంతో ఒక ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత ఎల్రెడ్ కుమార్, దర్శకుడు వెట్రిమారన్, హీరో సూరి, భవాని శ్రీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ “ఇంత అద్భుతమైన సినిమాని వెట్రిమారన్ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కుమరేశన్ పాత్ర కోసం సూరి ఈ సినిమాలో చాలా బాగా కష్టపడ్డాడు”అని చెప్పారు.

దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ “ఈ సినిమాను ముందుగా నాలుగు కోట్ల బడ్జెట్‌తో 30 నుంచి 35 రోజుల్లో ఒక చిన్న సినిమాగా పూర్తి చేద్దామని అనుకున్నాం. కానీ ఈ సినిమా మూడు రెట్లు ఎక్కువ ఖర్చుతో వంద రోజులు పైగా షూటింగ్ జరుపుకుంది. నిర్మాత ఎల్రెడ్ కుమార్ ఎక్కడ రాజీపడలేదు. ఇళయరాజా మంచి ట్యూన్స్ అందించారు”అని తెలిపారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్‌లో ఎమోషన్‌కి కనెక్ట్ అయి లేచి చప్పట్లు కొట్టేశాను. వెట్రిమారన్ అంటే చాలా రోజులు నుంచి నాకు ఇష్టం. ఆయన సినిమాలు అన్ని చూస్తాను. ఈ విడుదల సినిమాను రెండు పార్టులుగా చేశారు. ఇది చాలా గొప్ప సినిమా”అని అన్నారు. ఈ సమావేశంలో హీరో సూరి, భవాని శ్రీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News