Monday, December 23, 2024

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ

- Advertisement -
- Advertisement -

ఇప్పుడు బాలీవుడ్ లో అట్లీ పేరు మారుమోగిపోతోంది. కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సంచలన విజయం సాధించడంతో అందరి దృష్టీ అట్లీ మీద పడింది. తాజాగా జవాన్ వెయ్యి కోట్ల మార్కు దాటింది.  అయితే అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక మూవీ రానున్నట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.

జవాన్ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతిగా గడిపిన అట్లీ తదుపరి మూవీ కోసం ప్లానింగ్ మొదలుపెట్టినట్లు వినికిడి. ఇందులో భాగంగానే ఆయన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని సంప్రదించినట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య చర్చలు కొనసాగుతున్నా, ఎవరూ పెదవి విప్పడం లేదు. జనవరి నెలాఖరులో దీనిపై ఒక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేపట్టబోయే మూవీ ఇదే కావచ్చునని తెలుస్తోంది. కాగా అట్లీ గత రెండు నెలలుగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ తోనూ టచ్ లో ఉంటున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News