Tuesday, January 21, 2025

స్వీట్ మూమెంట్

- Advertisement -
- Advertisement -

Allu Arjun and Sneha have completed 11 years of marriage

 

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర తన స్టాంప్ వేసిన మరో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. తన లేటెస్ట్ సినిమా ‘పుష్ప’తో సెన్సేషనల్ విజయాన్ని అందుకొని బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ ఐకాన్ స్టార్. ఇక ఈ స్టార్ హీరో వీలు దొరికినప్పుడు తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తాడు. ఇలా ఎన్నో స్వీట్ మూమెంట్స్‌ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఐకాన్ స్టార్ ఇప్పుడు మరో బ్యూటిఫుల్ ఫోటోని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో బన్నీ అతని భార్య స్నేహ, పిల్లలు అల్లు అయాన్, అర్హ లు ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్, స్నేహల వివాహ బంధం ఆదివారంతో 11 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో కేక్ కట్ చేసి ఎంతో ఆనందంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అల్లు అర్జున్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News