- Advertisement -
హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో నాంపల్లి కోర్టు విచారణకు ఆన్‌లైన్‌లో అల్లు అర్జున్ హాజరుకానున్నారు. నేటితో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అతడికి ముగియనుంది. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను అల్లు అర్జున్ లాయర్లు దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గతంలో అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నాంపల్లి కోర్టు విధించింది. డిసెంబర్ 4న ఆర్ టిసి క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా విడుదల కావడంతో పాటు హీరో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
- Advertisement -