- Advertisement -
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు అయ్యారు. పుష్ప 2 సినిమా బెన్ ఫిట్ షో సందర్భంగా అర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సంధ్య థియేటర్ ఓనర్, అల్లుఅర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సంధ్య థియేటర్ ఓనర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా అల్లుఅర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో స్టేషన్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఇటీవల అల్లుఅర్జున్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
- Advertisement -