Monday, December 23, 2024

‘గని’ కోసం పుష్పరాజ్..

- Advertisement -
- Advertisement -

Allu Arjun as Chief Guest for Ghani's Pre Release Event

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిన సినిమా ‘గని’. అల్లు బాబీ కంపెనీ, రెనస్సన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ వెల్లడించారు. ఏప్రిల్ 2న వైజాగ్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అథితిగా రానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాగా, ఈ మూవీలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్‌, ట్రైలర్ కు ప్రేక్షకుల మంచి మంచి స్పందన వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 8న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Allu Arjun as Chief Guest for Ghani’s Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News