- Advertisement -
అల్లుఅర్జున్ ను వైద్య పరీక్షల కోసం పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అల్లుఅర్జున వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను హైకోర్టు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది.
ఇక, అల్లు అర్జున్ అరెస్టుతో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నాగబాబు.. అల్లుఅర్జున్ ఇంటికి చేరుకున్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లుఅర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
- Advertisement -