Monday, January 20, 2025

‘పుష్ప ది రైజ్’కు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

బెర్లిన్ 74వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు జర్మనీకి వెళ్లారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కాగా అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ’పుష్ప ది రైజ్’ సినిమాను బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ స్క్రీనింగ్ చేయడం విశేషం. దీంతో ‘పుష్ప ది రైజ్’కు దక్కిన ఈ అరుదైన గౌరవంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఆనందంలో వున్నారు. ఇక 2021లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు గాను అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ’పుష్ప- ద రూల్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News