Wednesday, January 22, 2025

పార్టీ లేదా పుష్ప

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం తన 41వ బర్త్‌డేని జరుపుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తున్న ‘పుష్ప2’ ఫస్ట్ లుక్ టీజ ర్, పోస్టర్ విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక అల్లు అర్జున్‌కు పలువురు ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్‌ని తెలియచేయగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా శనివారం రాత్రి తన ట్విట్టర్ ఖాతా ద్వారా హ్యాపీ బర్త్ డే బావా అంటూ అల్లు అర్జున్‌కి బర్త్‌డే విషెస్‌ని స్పెషల్‌గా పోస్ట్ చేసారు.

అయి తే దానికి స్పందిస్తూ అల్లు అర్జు న్… ‘థాంక్యూ వెరీ మచ్ బావ నీకు హ్యాపీ హగ్స్’ అని పోస్ట్ చేసారు. ‘కేవలం హగ్స్ మాత్రమేనా… పార్టీ లేదా పుష్ప’ అంటూ ఎన్టీఆర్ దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. అనంతరం స్పందించిన అల్లు అర్జున్, ‘వస్తున్నా’ అంటూ సరదాగా సమాదానం ఇవ్వడం జరిగిం ది. మొత్తంగా ఈ ఇద్దరు స్టార్స్ మధ్య జరిగిన ఈ క్రేజీ ట్వీట్స్ సంభాషణ అటు అల్లు ఫ్యాన్స్ తో పాటు ఇటు నందమూరి ఫ్యాన్స్‌లో ఎంతో ఆనందాన్ని నింపింది. కాగా ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News