Monday, December 23, 2024

పవన్‌ కల్యాణ్‌కు అల్లు అర్జున్‌ బర్త్ డే విషెస్‌.. ఏమని ట్వీట్ చేశాడంటే?

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్ 2 సోమవారం పవర్ స్టార్, ఏపీ డిప్యూటి సిఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖు ఆయన బర్త్ డే విషెస్‌ తెలుపుతున్నారు. అయితే.. ఇది సర్వసాదారణమే, కానీ ఓ స్టార్ హీరో పవన్ కు విషెస్ చెప్పడం మాత్రం వార్తల్లో హైలెట్ అవుతోంది. ఆ హీరోనే పుష్ప రాజ్.. అదే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

గత కొంత కాలంగా బన్నీ.. పవన్ కు దూరంగా ఉంటూ వచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్ ను లైట్ తీసుకున్న బన్నీ.. వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో పెద్ద దుమారమే నెలకొంది. బన్నీపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేశారు. ఇంతటితో ఆగిపోయిందనుకుంటే.. ఇటీవల, ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన బన్నీ..అక్కడ చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

ఇంకేముందు బన్నీని పవన్ అభిమానులు గట్టిగానే టార్గెట్ చేశారు. ఈ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ నుండి బన్నీని దూరం చేశాయని చెప్పొచ్చు. ఇలా వివాదం కొనసాగుతుండగా.. ఇవాళ పవన్ కు బర్త్ డే విషెష్ చెప్తుతాడా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో బన్నీ.. పవన్ కు విష్ చేశారు. ‘‘హ్యాపీ బర్త్‌డే పవర్‌ స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గారు’’ అని పోస్ట్‌ పెట్టారు బన్నీ. దీంతో బన్నీ పోస్ట్.. ప్రస్తుతం వార్తలో ట్రెండ్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News