Sunday, July 7, 2024

‘పుష్ప- 2 క్లైమాక్స్ యాక్షన్ సీన్లలో అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రేజీ సీక్వెల్ ‘పుష్ప- 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప- 1’కి సీక్వెల్‌గా ఈ మూవీ రానుంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్‌ను ప్రారంభించారు మేకర్స్. ఈ షెడ్యూల్ నెలరోజుల పాటు సాగనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

కాగా ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు చిత్రంలోని కీలక నటీనటులు పాల్గొంటున్నారు. ఇక ఈ షెడ్యూల్ లో ప్రస్తుతం ‘పుష్ప -2’ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ సెట్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో పుష్ప -2 చిత్ర షూటింగ్ టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోండగా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News