Friday, January 3, 2025

బర్త్ డే ట్రీట్ అదిరింది.. అమ్మవారి అవతారమెత్తిన పుష్పరాజ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పుష్ప సినిమాతో అల్లు అర్జున్ స్లైలిస్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. అభిమానుల అంచనాలకు కథతో మెప్పించాలనుకొనే హీరోలు ఎలాంటి పాత్ర వెయ్యడానికి అయినా సిద్ధపడతారు. అలాంటి హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్ట పడ్డాడు. డైరెక్టర్  భుజం పైకెత్తి ఉండాలని చెప్పడంతో రోజు మొత్తం ఎత్తిన చెయ్యి దించకుండా షూటింగ్ చేసే వాడట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ సరికొత్తగా డీ గ్లామర్‌గా కనిపించడంతో పాటు తన నటనతో ఈ సినిమాను నిలబెట్టాడు.

పుష్ప అంటూ ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్ అంటూ చెప్పిన డైలాగులు ప్యాన్ ఇండియా లెవల్లో పేలాయి. తాజాగా అల్లు అర్జున్‌ సరికొత్త అవతారంలో కనిపించారు.ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.  పోస్టర్ లో అల్లు అర్జున్ చీర కట్టి కాళికా మాత అవతారంలో ఫుల్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఇక పోస్టర్ లో బన్నీ చీరతో, ఒంటి నిండా నగలతో, ఒక చేత్తో గన్ తో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. అలాగే, ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ మూడు నిమిషాల టీజర్ విడుదల చేసి అంచనాలు పెంచేశారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News