Sunday, December 22, 2024

హీరో అల్లు అర్జున్‌కు భారీ ఊరట..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్ప రవి చంద్రకిరణ్ రెడ్డిని నంద్యాలలోని ఆయన నివాసానికి అల్లుఅర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ఓటు వేసి గెలిపించాలని బన్నీ కోరాడు.

అయితే, తన అభిమాన హీరో నంద్యాల వస్తున్నాడని తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శిల్ప రవి నివాసానికి చేరుకున్నారు. దీంతో పరిస్థితి కంట్రోల్ తప్పింది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌.. తనపై నమోదు అయిన కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేశారు. బుధవారం బన్నీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News