Sunday, December 22, 2024

సినీ నటుడు అల్లు అర్జున్‌కి ఎపి హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఎపి హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ అర్జున్, మాజీ ఎంఎల్‌ఎ రవిచంద్రకిశోర్‌రెడ్డి వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నవంబర్ 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. నవంబరు 6న తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు వెల్లడించింది.

సార్వత్రిక ఎన్నికల సమంలో నంద్యాల వైసిపి అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వచ్చారు. వైసిపి శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయన్ను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్యుల చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలపై అప్పట్లో నంద్యాల రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News