ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సక్సెస్‌ని అస్వాదిస్తున్నాడు. తొలి పాన్ ఇండియా సక్సెస్‌ని దక్కించుకొని రెట్టించిన ఉత్సాహంలో ఉన్నాడు ఈ స్టార్ హీరో. హిందీలో సైతం ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో బన్నీ ఆనందానికి అవుధుల్లేవు. బాలీవుడ్ నుంచి ఊహించని సక్సెస్ బన్నీకి దక్కింది. బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ స్టార్ హీరో నటనని ప్రశంసించి ట్వీట్లు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా దుబాయ్ టూర్‌లో ఉన్నాడు. అక్కడ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా బన్నీ దుబాయ్ స్కైలైన్ అద్భుతమైన వీక్షణను ఆస్వాదిస్తోన్న ఫోటో ఒకటి ఇన్ స్టాలో షేర్ చేశాడు. ఎత్తయిన భవనం నుంచి అసలైన దుబాయ్ అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఈ ఫోటోలో బన్నీ వైట్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి ఉండగా.. వెనుక నుంచి ఫొటో తీశారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో జోరుగా వైరల్ అవుతోంది.