Friday, January 3, 2025

కీలక సన్నివేశాల చిత్రీకరణలో…

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అయింది. కానీ అల్లు అర్జున్‌తో సంబంధం లేని సన్నివేశాలను తీసుకుంటూ వెళ్తున్నాడు సుకుమార్. ఇప్పుడు షూటింగ్‌లోకి బన్నీ కూడా వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాగుతున్న కొత్త షెడ్యూల్‌లో అతనిపై కీలక సన్నివేశాలు తీస్తున్నారట. అల్లు అర్జున్ కెరీర్‌ర్‌లో ‘పుష్ప’ ఒక మలుపు.

ఈ సినిమా తెలుగులో కన్నా హిందీలో పెద్ద హిట్ అయింది. దీంతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దాంతో, ‘పుష్ప 2’ ఇంకా భారీగా చెయ్యాలనే ఉద్దేశంతో ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు బన్నీ. గతేడాది డిసెంబర్‌లో ‘పుష్ప’ విడుదల అయింది. ఈ ఏడాది డిసెంబర్‌లో అతను ‘పుష్ప 2’ షూటింగ్‌లో చేరాడు. మొదటి భాగంలో నటించిన రష్మిక, ఫహద్ ఫాజిల్, అనసూయ ‘పుష్ప 2’ సినిమాలో కూడా కనిపిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News