Thursday, January 23, 2025

ప్రేమికుల రోజున రావాల్సిన సినిమా సంక్రాంతికి వస్తోంది

- Advertisement -
- Advertisement -

ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీబాయ్స్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘డేట్‌నైట్’ పాటను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో స్టార్ హీరో అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “ట్రైలర్ చూస్తుంటే ప్రేమికుల రోజున రావాల్సిన సినిమా సంక్రాంతికే విడుదలవుతున్న అనుభూతి కలుగుతుంది. శ్రీహర్ష అద్భుతమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలి”అని అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ.. “యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేమదేశం, తొలిప్రేమ, ఆర్య, హ్యాపీడేస్ తరహాలో ఆహ్లాదభరితంగా సాగుతుంది. థియేటర్స్‌లో ప్రతి ఒక్కరికి నవ్వులను పంచుతుంది. కథానాయకుడిగా ఆశిష్‌కు చక్కటి శుభారంభాన్ని అందిస్తుంది ఈ చిత్రం”అని చెప్పారు. శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ.. “ఫ్రెషర్స్ పార్టీ నేపథ్యంలో ‘డేట్‌నైట్’ పాట సాగుతుంది. రొటీన్‌కు భిన్నంగా ఈ పాటను చిత్రీకరించాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిరీష్, ఆశిష్, హర్షిత్ రెడ్డి పాల్గొన్నారు.

Allu Arjun Launched Date Night Song from Rowdy Boys

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News