Saturday, November 9, 2024

జాతీయ అవార్డు అందుకున్న అల్లుఅర్జున్..

- Advertisement -
- Advertisement -

69వ జాతీయ చలన చిత్ర పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో పుష్ప సినిమాకుగాను జాతీయ ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే జాతీయ ఉత్తమ నటి అవార్డును అలియా భట్ (గంగూభాయి కతియావాడి), కృతిసనన్ (మిమి), ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (కొండపొలం) జాతీయ అవార్డులను అందుకున్నారు.

Allu Arjun received Best Actor National Award

ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు గాను బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా కింగ్ సోలోమాన్, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నాటు నాటు పాటకు ప్రేమ్ రక్షిత్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి, ఉత్తమ సింగర్‌గా కాల భైరవ, ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌కు గానూ శ్రీనివాస్ మోహన్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’కు గాను రాజమౌళి జాతీయ అవార్డును అందుకున్నారు. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ’ఉప్పెన’కు గాను చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత నవీన యెర్నేని అవార్డు అందుకోవడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News