Friday, December 27, 2024

భారీ ఆఫర్‌ను వదులుకున్న అల్లు అర్జున్..

- Advertisement -
- Advertisement -

Allu Arjun Rejects Tobacco Ad

పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ వచ్చింది. ఈ స్టార్ హీరోకు భారీ క్రేజ్ వచ్చింది. దీంతో సినిమాలతో పాటుగా పలు యాడ్స్ కోసం కూడా అల్లు అర్జున్ ఒక హాట్ కేక్ లా మారాడు. దీంతో తాను ఎంత అడిగినా కూడా భారీ మొత్తంలో ఇచ్చి యాడ్స్ చేసుకోడానికి పలు బ్రాండ్స్ వారు రెడీగా ఉన్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఓ పొగాకు సంబంధించి యాడ్ చేస్తే 10 కోట్లు ఇస్తామన్నా కూడా ఆ యాడ్‌ను వదులుకున్నాడని సమాచారం. ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం గొప్పదని చెప్పి తీరాలి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ‘పుష్ప’కి సీక్వెల్ షూట్ కోసం సిద్ధమవుతున్నాడు.

Allu Arjun Rejects Tobacco Ad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News