Monday, December 23, 2024

‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ తో అల్లు అర్జున్..

- Advertisement -
- Advertisement -

బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’తో దేశవ్యాప్తంగా సంచనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సీక్వెల్ పుష్ప2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తర్వాత బన్నీ మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో బన్నీ పనిచేయనున్నాడు.

తాజాగా ఈ మూవీ నిర్మాణ సంస్థ టి సిరీస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. టీ సిరీస్ ప్రొడక్షన్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించనున్నారు. టాలీవుడ్ లో తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్.. ఇప్పుడు బన్నీతో ఎలాంటి సినిమా చేస్తాడోనని అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News