Wednesday, January 22, 2025

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ పెద్ద సక్సెస్ కావాలిః అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఇందులో రావు రమేష్ కథానాయకుడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు.

హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా, సుకుమార్ విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “తబిత భర్త సుకుమార్ పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్నారు. ఆవిడకు ఏ అవసరం లేకున్నా సినిమా చేస్తున్నందుకు థాంక్స్. సుకుమార్‌కి ఏమాత్రం సంబంధం లేకుండా ఆవిడ ఈ సినిమా చేశారు. అందుకు సభాముఖంగా అభినందిస్తున్నా. ఇప్పటికే లక్ష్మణ్ కార్య ఈ టీం అందరికీ హిట్ ఇచ్చారు. నా మనసుకు ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ రావు రమేష్. ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇటువంటి కథలు ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మాట్లాడుతూ… “లక్ష్మణ్ కార్య ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. రావు రమేష్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం అద్భుతమైన ప్రపంచాన్ని దర్శకుడు లక్ష్మణ్ కార్య సృష్టించాడు. సింప్లిసిటీని టచ్ చేశాడు. అందులో గొప్ప హ్యూమర్ రాశాడు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చే చిత్రమిది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తబితా సుకుమార్, రమ్య పసుపులేటి, ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్, పీబీఆర్ సినిమాస్ ప్రసాద్, లోకమాత్రే సినిమాటిక్స్ మోహన్ కార్య, దర్శకుడు లక్ష్మణ్ కార్య, అంకిత్ కొయ్య, నిర్మాత శ్రీహరి, పీబీఆర్ సినిమాస్ బుజ్జి, నటి ఇంద్రజ, మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ శశి, సాహిత్య రచయిత భాస్కరభట్ల, సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News