Tuesday, December 24, 2024

వైసిపి మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

అంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మెగా కుటుంబం చెరోపార్టీ తలో మాట అన్నట్టుగా చీలిపోయింది. సిని నటుడు అల్లు అర్జున్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శిల్పారవిచంద్ర కిషోర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలించాలని నంద్యాల ఓటర్లకు విజ్ణప్తి చేశారు. శనివారం అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా నంద్యాలకు చేరుకున్నారు. అల్లు అర్జున్‌కు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు , అభిమానులు ,కాపు సంఘాల నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ తన మిత్రుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. బయట వేచి ఉన్న అభిమానులకు అభివాదం చేశారు.

ప్యాన్ గుర్తుపై ఓటు వేసి తన మిత్రుడు శిల్పాను భారీ మెజారిటీతో గెలిపించాలని నంద్యాల నియోజకవర్గ ప్రజలకు , తన అభిమానులకు అల్లు అర్జున్ విజ్ణప్తి చేశారు. తన విజయం కోరుతూ తనకు మద్దతు ప్రకటించి శుభాకాంక్షలు తెలిపిన తన మిత్రుడు అల్లు అర్జున్‌కు వైసిపి అభ్యర్ధి శిల్పారవిచంద్రకిశోర్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రవి తన మిత్రుడు బన్నికి ధన్యవాదాలు తెలిపారు. బన్ని వైసిపికి మద్దతు పలకడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ శిల్పాపైన కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి నశ్యం మహ్మద్ ఫరూఖ్ పోటీలో ఉన్నారు. మరో వైపు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తోపాటు రామ్‌చరణ్ పిఠాపురం వెళ్లి జనసేన అభ్యర్ధి పవన్‌కళ్యాణ్‌కు మద్దతు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News