Monday, November 18, 2024

‘ఐకాన్’ కంటే ముందే ఆ మూవీ…

- Advertisement -
- Advertisement -

bunny

‘పుష్ప’ సినిమా పూర్తయిన వెంటనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ కొరటాల శివ ‘ఆచార్య’ను పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యాడు. వచ్చే ఏడాదికి అల్లు అర్జున్ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. కొరటాల మూవీ వాయిదా పడ్డ నేపథ్యంలో పుష్ప సినిమా తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా ఏంటి? అంటే అందరి దృష్టి ‘ఐకాన్’ పైకి వెళ్లింది. మూడేళ్ల క్రితం ఐకాన్ సినిమా ప్రకటన వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను పుష్ప చిత్రం తర్వాత పట్టాలెక్కిస్తారని అనుకుంటున్న సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. పుష్ప సినిమా పూర్తయిన తర్వాత రెండు, మూడు నెలల బ్రేక్ తీసుకుని బన్నీ తదుపరి సినిమాను ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసింది.

‘కేజీఎఫ్ 2’ను ముగించి ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఇప్పటికే అల్లు అర్జున్‌తో సినిమాను ఖరారు చేసుకున్నాడట. అల్లు అరవింద్‌తో ప్రశాంత్ నీల్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన బ్యానర్‌లోనే ఈ సినిమాను చేసేందుకు ప్రశాంత్ నీల్ ఒప్పుకున్నాడని తెలిసింది. వీరిద్దరి కాంబో మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లోనే పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. ‘పుష్ప’ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ నీల్ మూవీకి అల్లు అర్జున్ సిద్ధమవుతాడు. మొత్తానికి ‘ఐకాన్’ కంటే ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడని సమాచారం.

Allu Arjun team up with KGF Director Prashanth Neel?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News