హైదరాబాద్: తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించడంతో పాటు కట్టుబడి ఉంటానన్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమానులందికీ కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానన్నారు. ఆ రోజు జరిగిన ఘటన బాధాకరమన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడడంలేదన్నారు. తాను బాగున్నానని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. చంచల్‌గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో శుక్రవారం సాయంత్రం అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు: అల్లు అర్జున్
- Advertisement -
- Advertisement -
- Advertisement -