- Advertisement -
హీరో అల్లు అర్జున్ తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయల్దేరారు. అయన వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డిలు ఉన్నారు. మరికాసేపట్లో పిఎస్ కు చేరుకోనున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లుఅర్జున్ పోలీసులు విచారించనున్నారు. చిక్కడపల్లి ఎసిపి, దర్యాప్తు అధికారి రమేష్ కుమార్ తోపాటు సెంట్రల్ జోన్ డిసిపిలు బన్నీని ప్రశ్నించనున్నారు. దీంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పిఎస్ నుంచి 200 మీటర్ల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు.
- Advertisement -