Monday, January 20, 2025

అల్లుఅర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమా..

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ నాలుగోసారి రిపీట్ కాంబోతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటననను నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రీయేషన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి. ‘ది డైనమిక్ డ్యూ ఈజ్ బ్యాక్ అంటూ’.. బన్ని-తివిక్రమ్ కలయికలో నాలుగో సినిమా రాబోతున్నట్లు ప్రకటించాయి.

కాగా, ఇప్పటికే వీరి కాంబినేషన్ లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురం’ వంటి మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక, ‘పుష్ప’ సినిమాతో బన్ని దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న నేపథ్యంలో మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అభిమానులతోపాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచాలు నెలకొన్నాయి. ప్రస్తుతం బన్ని, ‘పుష్ప2’లో నటిస్తుండగా, తివిక్రమ్ ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నారు.

Also Read: ఆసక్తికరంగా ‘పెదకాపు-1’ టీజర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News