Sunday, January 12, 2025

ఏప్రిల్ నుంచి అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్

- Advertisement -
- Advertisement -

బాక్సాఫీస్ దగ్గర కూడా తాను ఐకాన్ స్టారే అని అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’తో మరోసారి నిరూపించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.922 కోట్లను రాబట్టి.. అత్యంత వేగంగా ఈ మైలురాయిని సాధించిన భారతీయ చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బన్నీ తర్వాత చేయబోయే సినిమా పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. అల్లు అర్జున్… త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన కొత్త ప్రాజెక్ట్‌ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

కాగా సంక్రాంతి పండుగ తర్వాత బన్నీ, -త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో రాబోతుంది. ఆ వీడియో మేకింగ్ పై ప్రస్తుతం త్రివిక్రమ్ దృష్టి పెట్టారు. అయితే 2025 ఏప్రిల్‌లో ఈ సినిమా షూట్ ప్రారంభం కావచ్చు అని టాక్. ‘పుష్ప 2’ భారీ హిట్ తర్వాత కథ విషయంలో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే నటీనటుల ఎంపికలో కూడా మార్పులు చేయబోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులతో పాటు తమిళ, – కన్నడ నటీనటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తారట. కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ సంగీతం అదించబోతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News