Wednesday, April 2, 2025

అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా.. షూటింగ్ ఎప్పటినుంచంటే..

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడు సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ ఉంటుంది వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ అధికారికంగా అప్‌డేట్ ఇచ్చారు. ఈ అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. ఇక ఈ సినిమా మైథలాజికల్ జానర్‌లో ఉంటుందని.. సోషియో ఫాంటసీ కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. పురాణా ఆధారంగానే ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు ఉంటాయన్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News