Thursday, December 19, 2024

నాగార్జున సాగర్‌లో అల్లు అర్జున్ సందడి..

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: నాగార్జున సాగర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని చింతపల్లిలో మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఫంక్షన్ హాల్ కంచర్ల కన్వెన్షన్ పాలస్ ను అల్లుఅర్జున్ శనివారం ప్రారంభించారు. అల్లుఅర్జున్ వస్తున్నట్లు తెలువడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బన్నీకి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.

కాగా, వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుండి బిఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు అల్లుఅర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, తన ఎన్నికల ప్రచారానికి అల్లుఅర్జున్ వస్తాడని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News