- Advertisement -
సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను హీరో అల్లుఅర్జున్ పరామర్శించారు. మంగళవారం పోలీసుల అనుమతితో హాస్పటల్ కు వెళ్లారు బన్నీ. ప్రడ్యూసర్ దిల్ రాజుతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన అల్లుఅర్జున్.. శ్రీతేజ్ తోపాటు అతని తండ్రి భాస్కర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య వివరాలను డాక్టర్ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాలు ఆస్పత్రిలో ఉన్న అనంతరం అల్లుఅర్జున్ తిరిగి వెళ్లిపోయారు.
- Advertisement -