- Advertisement -
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మంగళవారం బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. హాస్పటల్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను ఇవాళ అల్లు అర్జున్ పరామర్శింనున్నట్లు తెలుస్తోంది. ఏ సమయంలో వెళ్తారనే విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే రాంగోపాల్ పేట పోలీసులు.. తమ ఆనుమతి లేనిదే ఆస్పత్రికి వెళ్లొద్దని అల్లుఅర్జున్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో అల్లుఅర్జున్ పోలీసులు అనుమతితో ఆస్ప్రతికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో కిమ్స్ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. కాగా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ 35 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
- Advertisement -