Monday, December 23, 2024

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం

- Advertisement -
ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించారు. ఎంతో ఉద్విగ్నంగా ఉందని, మ్యూజియం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.  “మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు విగ్రహం ఇవాళ  ఆవిష్కరిస్తున్నారు. ప్రతి నటుడికి ఇదొక మైలురాయి వంటి ఘట్టం” అని అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

- Advertisement -

లండన్ లోని సిటీ సెంటర్ లో మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం ఉంది. సింగపూర్ లో దీనికి ఒక శాఖ ఉంది. ఇక్కడ కూడా ప్రపంచవ్యాప్త  ప్రముఖుల మైనపు విగ్రహాలను ప్రతిష్ఠించారు.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహ గౌరవాన్ని పొందిన తొలి తెలుగు నటుడు, తొలి దక్షిణాది నటుడు ప్రభాస్. ఆ తర్వాత మహేశ్ బాబు వ్యాక్స్ స్టాచ్యూను కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

https://twitter.com/alluarjun/status/1773284838595793134

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News