Tuesday, December 3, 2024

ఎపి హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ఎపి హైకోర్టును ఆశ్రయించారు. 2024, మే 11న నంద్యాలలో అప్పటి వైసిపి ఎంఎల్‌ఎ శిల్పా రవి చంద్ర తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ సమయంలో శిల్పారవి కానీ, అల్లు అర్జున్ తరపున కాని ముందస్తు అనుమతి తీసుకోలేదు. దీంతో స్థానిక విఆర్‌ఓ సీరియస్ అయ్యారు.

అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్‌తోపాటు శిల్పా రవిపై సెక్షన్ 144, పోలీస్ యాక్ట 30 అమలును ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ తాజాగా హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. మంగళవారం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News