Thursday, January 23, 2025

అల్లు అరవింద్, అల్లు అర్జున్ కాంప్లిమెంట్స్ గుర్తుండిపోతాయి

- Advertisement -
- Advertisement -

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మాతగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచి వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మీడియాతో మాట్లాడుతూ “దర్శకుడు సాయి రాజేష్ ఈ కథను ఆన్ లైన్‌లోనే వినిపించారు. అలా మా జర్నీ మొదలైంది. ప్రేమిస్తున్నా పాటను ముందు పూర్తిచేశాం. ఆ పాట సాయి రాజేష్‌కి బాగా నచ్చింది. ఈ పాటను రెండు, మూడు రోజుల్లోనే పూర్తి చేశాను. నా మ్యూజిక్‌కు అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు, నాని మెసెజ్ నాకు స్పెషల్. ప్రతి సినిమాకు నా బెస్ట్ ఇచ్చాను. కానీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది”అని అన్నారు.

Also Read: అణుదాడికి పాల్పడితే కిమ్ పాలన అంతమైనట్టే : దక్షిణ కొరియా హెచ్చరిక

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News