Monday, December 23, 2024

“బడ్డీ” సినిమా నుంచి అల్లు శిరీష్ ఫస్ట్ లుక్

- Advertisement -
- Advertisement -

మంచి ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల “ఊర్వశివో రాక్షసివో” మంచి హిట్ అందుకున్నారు. ప్రేక్షకుల నుండి ఈ మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాలో నటీనటుల నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు శిరీష్ కొత్త సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజా సమాచారం ఏమిటంటే, టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌పై శిరీష్ కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతోంది.

మేకర్స్ ఈరోజు సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్‌ని విడుదల చేసారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో అల్లు శిరీష్ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్ అతని పక్కన ఫైటింగ్ పొజిషన్‌లో నిలబడి ఉంది. బడ్డీ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అల్లు శిరీష్ తన బడ్డీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రూబెన్ ఎడిటింగ్ నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News