Monday, December 23, 2024

నేటి సమాజానికి కావాల్సిన సినిమా

- Advertisement -
- Advertisement -

హీరో శ్రీవిష్ణు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫిక్షనల్ బయోపిక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నిజాయితీకి మారుపేరు’ అనేది ఉపశీర్షిక. అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ ‘అల్లూరి’ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ “ఈ సినిమాలో నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తా. ఇది ఫిక్షనల్ బయోపిక్. రియల్‌గా జరిగిన సంఘటనని తీసుకొని ఒక కథగా చేశాం. నేటి సమాజానికి కావాల్సిన సినిమా ఇది”అని అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘మాకు ‘అల్లూరి’ చాలా స్పెషల్ మూవీ. అన్ని కమర్షియల్ హంగులు వున్న గొప్ప సినిమాగా ఇది ఉండబోతుంది” అని తెలిపారు. దర్శకుడు ప్రదీప్ వర్మ మాట్లాడుతూ “ఒక నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్ ఇది. 16 ఏళ్ళ వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒక నిజాయితీ గల పోలీసు అధికారి ఏం చేశారనేది ఆయన ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాం. ఈ సినిమాని చూసిన అందరికీ పోలీసుపై చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శివాజీ, తేజ సజ్జా తదితరులు పాల్గొన్నారు.

Alluri Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News