Wednesday, January 22, 2025

అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా

- Advertisement -
- Advertisement -

Alluri Movie Trailer launch by Nani

హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. ఈనెల 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. తనికెళ్ల భరణి ఒక యువకుడికి చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలతో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత శ్రీవిష్ణు నేరస్తులను అదుపు చేయడంలో తనకంటూ ఓ స్పెషల్ స్టయిల్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అల్లూరిగా పరిచమయ్యారు. కేసులను డీల్ చేయడానికి వేరే మార్గం లేనప్పుడు అతను వయోలెంట్‌గా మారుతాడు. పోలీస్ ఉద్యోగం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తాడు. ట్రైలర్‌లో శ్రీవిష్ణు అద్భుతమైన నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బావుంది. అలాగే శ్రీవిష్ణుకి కూడా కొత్తగా వుంది. ‘అల్లూరి’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ చాలా నిజాయితీ గల గొప్ప సినిమా ఇదని చెప్పారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ “అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా ఇది. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా ఇంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది”అని పేర్కొన్నారు. ఇక ఈనెల 18న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Alluri Movie Trailer launch by Nani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News