Monday, January 20, 2025

చెట్టుకు ఉరేసుకుంది ఆ ప్రేమజంటనే

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కరకవలస గ్రామ శివారులో ఉరేసుకున్న యువతి, యువకుడు ప్రేమజంటగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మైనర్లు అని విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తూర్పుగోదావరి జిల్లా హుకుపేట గ్రామంలో జ్యోతి(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన చైతన్య(17), బాలికతో ప్రేమలో ఉన్నట్టు సమాచారం.

గత మంగళవారం ఇంట్లో నుంచి ఇద్దరు బయటకు వెళ్లడంతో ఇరు కుటుంబాల సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనంతగిరి మండలంలో యువతి, యువకుడు చెట్టుకు ఉరేసుకున్న సంఘటన పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అదృశ్యమైన యువతి, యువకుడు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని మృతదేహాలు తమ పిల్లలవే అని గుర్తించారు. మృతదేహాలకు పోలీసులు శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News