హైదరాబాద్ : నాడు భరతమాత దాస్యశృంఖాలను తెంచడం కోసం తెల్లదొరలను ఎదురొడ్డి ప్రాణత్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు భారత రత్న ప్రకటించాలని జనసేన అధినేత పవన్ క ళ్యాణ్ డిమాండ్ చేశారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేటి తరం దేశవాసులందరికీ అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ, ధీరత్వం, మృత్యువుకు వెరవని ధైర్యం, జ్ఞాన, ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని కోరారు.
Also Read: బిల్డింగ్‌పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ఆయన స్పూర్తిని దేశమంతటికీ చాటాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను మేమే స్వీకరిస్తామని చెప్పారు. ఆ చైతన్యమూర్తి వర్థంతి సందర్భంగా అంజలి ఘటించారు. వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదని, వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందని అన్నారు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికి వందేళ్లు అని పేర్కొన్నారు. ఈ పుణ్యతిథినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నానన్నారు.