హైదరాబాద్: ఊబకాయంను అంతం చేయడానికి కట్టుబడిన సంస్థ అల్యూరియన్, తమ అల్యూరియన్ స్వాలోబుల్ క్యాప్సూల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ కు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పర్యవేక్షణలోని జాతీయ రెగ్యులేటరీ అథారిటీ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్‌కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) అనుమతించిన పూర్తి స్ధాయి వైద్య ఉపకరణం ఇది.
డాక్టర్ శాంతను గౌర్ ప్రారంభించిన అల్యూరియన్‌కు ఉన్న ఏకైక లక్ష్యం ః ఊబకాయంను అంతం చేయడం. హార్వార్డ్ యూనివర్శిటీలో అండర్‌గ్రాడ్యుయేట్ విద్యనభ్యసించిన డాక్టర్ గౌర్, ఈ కంపెనీని తన వైద్య విద్యను హార్వార్డ్ మెడికల్ స్కూల్‌లో 2009లో పూర్తి చేస్తోన్న సమయంలో ప్రారంభించారు. తన భాగస్వామి మరియు పూర్వ హార్వార్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ రామ్ చుట్టానీతో కలిసి అల్యూరియన్ ప్రోగ్రామ్ కోసం తమ లక్ష్యం అభివృద్ధి చేశారు. ఈ అల్యూరియన్ ప్రోగ్రామ్‌లో అత్యంత కీలకంగా అల్యూరియన్ స్వాలోవబల్ క్యాప్సూల్ ఉంటుంది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి మరియు ఒకే ఒక స్వాలోవబుల్, ప్రొసీజర్‌లెస్ గ్యాస్ట్రిక్ బెలూన్ గా బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. అల్యూరియన్ స్వాలోవబుల్ క్యాప్సూల్‌ను అల్యూరియన్ వర్ట్యువల్ కేర్ సూట్‌తో జత కలిపారు. ఇది రిమోట్ పేషంట్ మానిటరింగ్ సొల్యూషన్. దీనికి అల్యూరియన్ ఐరిస్ ఏఐ ప్లాట్‌ఫామ్ తగిన శక్తిని అందిస్తుంది. దీనిలో అల్యూరియన్ మొబైల్ యాప్, కనెక్టడ్ స్కేల్ మరియు హెల్త్ ట్రాకర్ ఉంటుంది.
భారతదేశంలో ఊబకాయ సమస్యను నిర్వహించడం
ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019–21) ప్రకారం భారతదేశంలో ఊబకాయం మహిళల్లో 21% నుంచి 24%కు పెరగగా, పురుషులలో 19% నుంచి 23%కు 2016 మరియు 2021 మధ్యకాలంలో పెరిగింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, సురక్షితమైన, ప్రభావవంతమైన చికిత్సలు లేకపోవడం వంటివన్నీ కూడా ఊబకాయం కేసులు పెరగడానికి దోహపడుతున్నాయి. ఈ ఊబకాయం కారణంగా మధుమేహం మరియు గుండె వ్యాధులూ కలుగుతున్నాయి.
డైటింగ్ తో మాత్రమే తమ బరువు నియంత్రణ లక్ష్యాలను చేరుకోలేని వారికి అల్యూరియన్ ప్రోగ్రామ్ తగినట్లుగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఇన్వాసివ్ సర్జరీ లేదా ఎండోస్కోపీ చేయించుకోకూడదనుకుంటారో వారు కూడా ఈ విధానం అనుసరించవచ్చు. ఇది బరువు సంబంధిత కో–మార్చిబిడిటీలు అయిన మధుమేహం, వంధ్యత్వం లేదా కార్డియోవాస్క్యులర్ వ్యాధుల సంబంధిత చికిత్సలకూ తగినట్లుగా ఉంటుంది.
కేవలం 15 నిమిషాల క్లీనిక్ సందర్శనతో రోగులు అల్యూరియన్ స్వాలోవబుల్ కాప్సూల్‌ను మింగవచ్చు. ఇది సురక్షితమైన, తాత్కాలిక వీగన్ క్యాప్సూల్, ఇది ఉబ్బిన గ్యాస్ట్రిక్ బెలూన్ కలిగి ఉంటుంది. ఒకసారి కడుపులోకి చేరిన హెల్త్‌కేర్ నిపుణుడు ఓ క్యాథెటర్‌ను ఈ బెలూన్‌ను 550మిల్లీ లీటర్ల లిక్విడ్‌తో నింపేలా చేస్తారు. దీనికి ఎలాంటి శస్త్ర చికిత్స, ఎండోస్కోపి లేదా అనస్తీషియా అవసరం లేదు. ఓ సాధారణ ఎక్స్‌రే వినియోగించి ఈ బెలూన్ సరైన స్ధానంలో ఉందని నిర్ధారిస్తారు. ఈ ప్లేస్‌మెంట్ పూర్తయిన తరువాత ఈ బెలూన్ దాదాపు ఓ ద్రాక్ష పండు పరిమాణంలో ఉండి , రోగి కడుపులో తన స్ధానం ఆక్రమించి కడుపు నిండిదన్న భావన కలిగించి ఆహారం తీసుకునే పరిమాణం తగ్గిస్తుంది. ఈ బెలూన్ ఆకలిగా ఉందనే భావన తగ్గించడంతో పాటుగా దాదాపు 16 వారాలలో ఇది ఆటోమేటిక్‌గా కరిగి, శరీరం నుంచి సహజంగానే బయటకు వస్తుంది.
అల్యూరియన్ అనేది అంతర్జాతీయ బ్రాండ్. ఇది 58కు పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ అల్యూరియన్ ప్రోగ్రామ్‌తో ఒక లక్ష మందికి పైగా రోగులకు చికిత్సనందించారు. ప్రపంచవ్యాప్తంగా 600 క్లీనిక్‌లతో భాగస్వామ్యం కలిగిన అల్యూరియన్, రోగులు మొత్తంమీద ఒక మిలియన్ కిలోల బరువు తగ్గారు.
‘‘భారతీయునిగా, అల్యూరియన్‌కు ఇండియా ప్రత్యేకమార్కెట్. నా వ్యకిగత లక్ష్యంలో భాగంగా ఈ విప్లవాత్మక సాంకేతికతను భారతదేశానికి తీసుకురావడంతో పాటుగా ఊబకాయం, మధుమేహం అంతానికి సహాయపడుతున్నాను’’ అని డాక్టర్ శాంతను గౌర్, ఫౌండర్ –సీఈఓ అల్యూరియన్ అన్నారు.
ఆయనే మాట్లాడుతూ ‘‘వారి వివాహం సమీపిస్తున్నా లేదంటే ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా బరువు పెరిగినా, ఇటీవలి కాలంలో ఆరోగ్య పరంగా ఆందోళనకరమైన పరిస్థితి ఎదుర్కొన్నా, తమ సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపరుచుకోవాలన్నా లేదా ఓ శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముందుగా బరువు తగ్గాలనుకున్నా అల్యూరియన్ ప్రోగ్రామ్ ఓ సమాధానంగా లక్షలాది మంది భారతీయులకు నిలుస్తుంది’’ అని ఆయన అన్నారు.
అల్యూరియన్ ప్రోగ్రామ్‌లో అత్యంత కీలకంగా అల్యూరియన్స్ వర్ట్యువల్ కేర్ సూట్ ఉంటుంది. ఇది అల్యూరియన్ మొబైల్ యాప్, కనెక్టడ్ స్కేల్ మరియు హెల్త్ ట్రాకర్‌ను సింగిల్ డిజిటల్ అంబ్రెల్లాలో కలిగి ఉండి రిమోట్ పేషంట్ మానిటరింగ్, టెలి హెల్త్ మరియు సెక్యూర్ మెసేజింగ్‌ను కేర్ టీమ్‌తో కలిగి ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌కు ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ మరియు మెషీన్‌లెర్నింగ్ తోడ్పాటునందిస్తుంది. ఇది కేర్ టీమ్స్ తమ రోగులు మరియు వారి డాటాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తోంది.
కేవలం డైట్ లేదా వ్యాయామాలు చేయడంతో పోలిస్తే 2.5 రెట్లు అధికంగా బరువును అల్యూరియన్ ప్రోగ్రామ్‌లో కోల్పోతారు. మరీ ముఖ్యంగా, ఇది రోగులు తమ జీవనశైలి మార్పులు చేసుకునేందుకు తోడ్పడటంతో పాటుగా బెలూన్ పోయిన తరువాత కూడా చాలా కాలం పాటు అలాగే నిలిచి ఉంటుంది. ఎండోస్కోపిక్ మరియు బేరియాట్రిక్ వెయిట్ లాస్ సర్జన్, మోహక్ బేరియాట్రిక్స్‌కు చెందిన డాక్టర్ మోహిత్ భండారీ భారతదేశంలో అల్యూరియన్ ప్రోగ్రామ్‌లో అగ్రగామి. ఆయన మాట్లాడుతూ ‘‘భారతదేశంలో ఊబకాయం పెరుగుతుంది. భారతదేశంలో ప్రతి నలుగురులో ముగ్గురు నగర భారతీయులు అధిక బరువు కలిగి ఉంటున్నారు. ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో అత్యంత అనుభవం కలిగిన బేరియాట్రిక్ సర్జన్‌లో ఒకరిగా ఇప్పటి వరకూ 17వేలకు పైగా బేరియాట్రిక్ శస్త్రచికిత్సలను చేశాను. బరువు నిర్వహణను ఓ కళంకంగా కాకుండా సాధారణతగా చూడాలి మరియు ఆ దిశగా అల్యూరియన్ ప్రోగ్రామ్ ఆ దిశగా ఓ ముందడుగు’’ అని అన్నారు
అల్యూరియన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఫౌండింగ్ భాగస్వామి డాక్టర్ రామ్ చుట్టాని మాట్లాడుతూ ‘‘ రోగులకు అత్యున్నత శ్రేణి అనుభవాలను అందించడానికి అల్యూరియన్ కట్టుబడి ఉంది. వారి భద్రత మాకు అత్యంత ప్రాధాన్యతాంశం. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం అల్యూరియన్ ప్రోగ్రామ్‌కు నిరూపిత సామర్ధ్యం, భద్రత ఉంది. ఇది రోగులు 10–15% బరువును దాదాపు 16 వారాలలో తగ్గే అవకాశం కల్పిస్తుంది’’ అని అన్నారు.
అల్యూరియన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ బెనోయిట్ చార్డన్ మాట్లాడుతూ ‘‘ పలు మార్కెట్‌లలో అల్యూరియన్ సాధించిన విజయం పరిగణలోకి తీసుకుంటే, మా ప్రోగ్రామ్ మరియు రోగి అంచనాలు కారణంగా నడుమ ఖచ్చితమైన జోడి కుదిరిన ఫలితం. భారతదేశంలో ఊబకాయ కేసులు పెరుగుతుండటం చేత దేశంలో మా ప్రోగ్రామ్ అపూర్వ విజయం సాధించగలదని నమ్ముతున్నాము. ఇక్కడ మా మార్కెట్ పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం, దాదాపు ఒక మిలియన్ ఊబకాయులు ఆందోళన చెందుతుండటంతో పాటుగా తమ బరువు నియంత్రించుకునేందుకు అల్యూరియన్ వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
Allurion Launches Weight Management Solutions