Friday, November 22, 2024

అల్లూరి దేశభక్తి అసమానం

- Advertisement -
- Advertisement -
ఆంగ్లేయులపై సీతారామరాజుది ప్రత్యేక యుద్ధ నైపుణ్యం
మహనీయుల చరిత్రను భావి తరాలకు భద్రంగా అందించాలి
అల్లూరి 125వ జయంతి ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలు
భీమవరంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహం, స్మృతి వనాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన రాష్ట్రపతి

మనతెలంగాణ/హైదరాబాద్: మన్యం వీరుడు అల్లూ రి సీతారామరాజు పోరాటం, దేశభక్తి అసమానమైనవని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తించారు. అ ల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ము గింపు కార్యక్రమం మంగళవారం నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ తమిళిసై సౌం దరరాజన్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు హా జరై మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనాన్ని హైదరాబాద్ నుంచి రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, నేతాజీ పోరా టం వలే అల్లూరి సీతారామరాజు పోరాటం కూడా ప్ర జల్లో స్ఫూర్తి నింపిందని కొనియాడారు. మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలని తెలిపారు. అల్లూరి ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యం తో ఆంగ్లేయులపై పోరాటం చేశారని రాష్ట్రపతి వివరించారు.

అల్లూరి సీతారామరాజు పోరాటం మరువలేనిదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పే ర్కొన్నారు. అ ల్లూరి 125వ జయంతి ముగింపు వేడుకల్లో తమిళిసై ఆధ్యంతం తెలుగులోనే ప్రసంగించా రు. అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం, దేశభక్తిని గవర్నర్ కొనియాడారు. చరిత్ర స్మరించుకోదగ్గ వీ రుడు అల్లూరి సీతారామరాజు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కొందరు చరిత్రలో సజీ వ సాక్ష్యాలుగా నిలిస్తే మరికొందరు చరిత్రను సృష్టిస్తారని…అలా చరిత్రను సృష్టించిన వ్యక్తే అల్లూరి సీతారామరాజు అని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. గొప్ప వ్యక్తుల స్మరణతోనే చరిత్రకు గుర్తింపు లభిస్తుందని వ్యాఖ్యానించారు. అల్లూరి గిరిజనులను ఏకం చేసి ఆంగ్లేయులకు ఎదురునిలిచి పోరాడారని చెప్పా రు. అడవి బిడ్డ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేళ దేశం మొత్తం గర్వంగా నివాళి అర్పిస్తుందన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు విస్మరించలేని క్షత్రియ వీరుడు అల్లూరి సీతారామరాజుఅని కొనియాడారు. అల్లూరి వీరుడు మాత్రమే కాదు.వైద్యుడు, అధ్యాత్మిక వేత్త కూడా అని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. హాకీంపేట్ విమానాశ్రయంలో సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘనస్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంగళవారం ఆమె హైదరాబాద్ నగరానికి వచ్చారు. తెలంగాణ సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హకీంపేట విమానాశ్రయానికి వెళ్లి ముర్ముకు స్వాగతం పలికారు. ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో రాష్ట్రపతి ముర్ము మంగళవారం ఉదయం హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ దక్కిం ది. సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై హకీంపేటకు వెళ్లి ఆమెకు వెల్కమ్ పలికారు. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభివాదం చేశారు.

సిఎం కెసిఆర్‌తో పాటు పాటు సిఎస్ శాంతికుమారి, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎంఎల్‌ఎలు జీవన్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, ప్రభాకర్ తదితరులు రాష్ట్రపతి ముర్ముకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభివాదం చేశారు. ద్రౌపది ముర్ము హకీంపేట వినామాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుని అల్లూరి జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రపతి పర్యటన
రాష్ట్ర ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన మంగళవారం రాత్రి ముగిసింది. హకీంపేట వినామాశ్రయంలో మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News