Thursday, August 29, 2024

కుండపోత వర్షాలు.. ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

కృష్ణానది పరివాహకగా ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ నిండుకుండలా తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్దం 129టిఎంసీలు కాగా.. ఇప్పటికే 100 టీఎంసీలకు చేరుకుంది. రాగల నాలుగు రోజలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో అధికారులు ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాలవైపు పరుగులు పెడుతోంది.

దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంలోకి భారీగా వరద చేరుకుంటోంది. నారాయణపూర్ ప్రాజెక్టులో కూడా 37టీఎంసీల పూర్తి స్థాయి నిలువ సామర్ధానికిగాను 28టిఎంసీల నీరు నిలువ ఉంది.దీంతో ఈరోజుతో నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి దిగువన జూరాలకు నీటిని విడుదల చేయనున్నారు. మరో రెండు రోజుల్లో జూరాల కూడా నిండనుంది. ఆ తర్వాత శ్రీశైలం డ్యామ్‌కు నీటిని వదలనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News