Monday, December 23, 2024

ఆల్మట్టి గేట్ల ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :పశ్చిమ కనుమల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.కేంద్ర వాతావరణ శాఖ కర్ణాటక రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. కేంద్ర జలసంఘం ముందు జాగ్రత్త హెచ్చరికల మేరకు కర్ణాటక ప్రభుత్వం బుధవారం నాడు ఆల్మట్టి ప్రాజెక్టులో 14 గేట్లు ఎత్తివేసింది. ఎగువ నుంచివస్తున్న వరద ప్రవాహాలను సమన్వయం చేసుకుంటూ దిగువకు నీటిని విడుదల చేస్తోంది. ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల నీరు చేరుతుండగా,

65వేల క్యసుక్కలు నీటిని దిగువకు విడుదల చే స్తోంది. నారాయణపూర్ జలాశయం కూడా గరిష్ట స్థాయికి చేరటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేతకు అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణానది జ లాలు తెలుగు రాష్ట్రాల వైపు పరుగులు పెడుతున్నాయి. గురువారం ఉదయానికి జూరాల ప్రాజెక్టును తాకనున్నాయి. ఇప్పటికే జూరాల జలాశయంలో 7.66టిఎంసీల నీరు నిలువ ఉంది. ఎగువ నుంచి 2500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 750, భీమాలిఫ్ట్ వన్ ద్వారా 1150, భీమా 2ద్వారా 847 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. తాజాగా జూరాల ప్రాజెక్టు కుడి కాలువకు కూడా నీటి విడుదలను ప్రారంభించారు.

రెండు రోజుల్లో శ్రీశైలంకు కృష్ణమ్మ:
ఎగువ భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో వదర ప్రవాహాలు భారీగా పెరగుతున్నాయి. అటు తుంగభద్ర ఉపనదులు కూడా ఉప్పోంగుతున్నాయి. తుంగ, భద్ర నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 49522క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 43టిఎంసీలకు పెరిగింది. ఇదే ఊపులో తుంగభద్ర జలాశయంలోకి నీరు చేరితే మరో నాలుగైదు రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి తుంగభద్ర గేట్లు కూడా తెరుచుకోనున్నాయి. ఇటు కృష్ణా , అటు తుంగభద్ర నదలు ద్వారా వరద ప్రవాహాలు పెరగనున్నాయి.

శ్రీశైలం జలాశయంలోకి మరో రెండు రోజుల్లోనే కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3585క్యూసెక్కులు ఉండగా , ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ గట్టు పవర్ హౌస్‌ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 30912క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఒక్క రోజులోనే 812 అడుగుల నుంచి 808అడుగులకు పడిపోయింది. నీటి నిలువ కూడా 35టిఎంసీల నుంచి 33టిఎంసీలకు పడిపోయింది.
సాగర్‌కు 19247క్యూసెక్కులు:
నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి 19247క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం ఒక్కరోజులోనే 503అడుగుల నుంచి 504అడుగులకు పెరిగింది.
మేడిగడ్డకు ప్రాణహిత పరవళ్లు:
గోదావరి నదీ పరివాహకంగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 4468క్యూసెక్కల నీరు చేరుతోంది.గోదావరికి ఉపనదిగా ఉన్న ప్రాణహిత నదికి వరదనీరు పోటెత్తింది. మేడిగడ్డకు ప్రాణహిత ద్వారా 49500క్యూసెక్కుల నీరు చేరుతోంది. 85గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు.

ఐదు రోజులు అతిభారీ వర్షాలు:
తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాగల ఐదురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.దక్షిణ చత్తిస్‌గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బుధవారం బలహీనపడింది. ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మలుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. గురువారం రాష్ట్రంలోని 12 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోమరంభీం, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు , భధ్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుముల, మెరుపులు గంటకు 40కి.మి వేగంతో కూడిన ఈదురుగాలలతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News