Sunday, January 19, 2025

బాదం పప్పులతో మధుమేహం నివారణ!

- Advertisement -
- Advertisement -

నవంబర్ 14, 2023న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకోనుండగా, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి మధుమేహ మహమ్మారి వైపు మళ్లింది. ‘డయాబెటిస్ క్యాపిటల్’ గా భారతదేశం, ఈ సమస్యకు కేంద్రబిందువుగా ఉంది. ఈ సంవత్సరం ప్రపంచ మధుమేహ దినోత్సవం టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, ఇది మధుమేహం యొక్క ఆగమనాన్ని నివారించడం లేదా ఆలస్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. బాదంపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రీడయాబెటిస్ ను నివారించడం సాధ్యమవుతుంది.

ఇటీవలి అధ్యయనాలు భోజనానికి 30 నిమిషాల ముందు 20 గ్రాముల బాదంపప్పును తీసుకోవడం వల్ల వ్యక్తులలో బ్లడ్ షుగర్ స్థాయిలు మెరుగుపడతాయని వెల్లడించింది. 23.3% (30లో ఏడుగురు) ప్రీడయాబెటిస్ రోగులు భోజనానికి ముందు బాదం (20గ్రా) తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర సాధారణ స్థాయికి తిరిగి వచ్చినట్లు కూడా కనుగొనబడింది. 12 వారాలపాటు ప్రతిరోజూ బాదంపప్పు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టన్స్ తగ్గటం తో పాటుగా, ఫాస్టింగ్ గ్లూకోజ్ మరియు ప్యాంక్రియాటిక్ పనితీరు మెరుగుపడుతుందని మరొక అధ్యయనం వెల్లడించింది. ప్రతి రోజూ బాదం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, BMI (బాడీ మాస్ ఇండెక్స్), నడుము చుట్టుకొలత తగ్గడం, మొత్తం కొలెస్ట్రాల్ తగ్గుదల ఏర్పడింది. బాదములు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ప్రోటీన్, డైటరీ ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్ E, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలను కలిగి ఉంటాయి. ఫలితంగా, అవి ప్రీడయాబెటిస్ ఉన్న వ్యక్తులకు ఆదర్శవంతమైన చిరుతిండిగా నిలుస్తాయి.

మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన ఇటీవలి అధ్యయనం దేశ జనాభాలో మిలియన్ కంటే ఎక్కువ మంది మధుమేహంతో పోరాడుతున్నారని అంచనా వేసింది.

ప్రముఖ బాలీవుడ్ నటి, సెలబ్రిటీ, సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ..“మనం జీవిస్తున్న వేగవంతమైన ప్రపంచంలో, మధుమేహం చాలా మంది జీవితాల్లోకి నిశ్శబ్దంగా ప్రవేశించింది. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని సమీపిస్తున్న తరుణంలో, ప్రతి ఒక్కరూ తమ రక్తంలోని చక్కెర స్థాయిలపై నిఘా ఉంచాలని మాత్రమే కాకుండా వారి రోజువారీ అలవాట్లను కూడా అంచనా వేయాలని, అవసరమైన చోట మార్పులు చేయాలని నేను గట్టిగా సూచిస్తున్నాను. నియంత్రిత, పోషకమైన భోజనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు, వేయించిన పదార్ధాలకు బదులుగా కొన్ని బాదంపప్పులను ఎంచుకోవడం చాలా సులభం. బాదంలో చాలా పోషకాలు ఉన్నాయి“ అని అన్నారు.

భారతదేశంలో ప్రీ-డయాబెటిస్ పరిస్థితి ఉన్నవారి సంఖ్య పెరుగుతోందని, ప్రఖ్యాత ఫిట్‌నెస్ నిపుణులు యాస్మిన్ కరాచీవాలా చెబుతూ.. “ప్రీడయాబెటిస్ తరచుగా నిశ్చల జీవనశైలి మరియు పోషకాహార లోపం వల్ల వస్తుంది. అయినప్పటికీ, స్థిరమైన, ఆరోగ్య-కేంద్రీకృత చర్యలతో దీనిని తిప్పికొట్టడం సాధ్యమవుతుంది. చురుకైన దినచర్యను కొనసాగించడానికి, మీరు నిజంగా ఇష్టపడే వ్యాయామాన్ని కనుగొనడం చాలా అవసరం, అది డ్యాన్స్, రన్నింగ్, యోగా, స్విమ్మింగ్ లేదా ఏరోబిక్స్ కావచ్చు. యాక్టివిటీతో పాటు, తెలివైన ఆహార ఎంపికలు కీలక పాత్ర పోషిస్తాయి. పోషకాహార ప్రత్యామ్నాయాల కోసం అనారోగ్యకరమైన స్నాక్స్‌ను వదిలి, బాదంపప్పుల వంటివి తీసుకోవటం మంచింది” అని అన్నారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీసుకోవాల్సిన ఆహరం, ప్రీ-డయాబెటిస్‌ను నియంత్రించే మార్గాల గురించి ఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లోని డైటెటిక్స్ రీజనల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ…”టైప్ 2 డయాబెటిస్‌తో బాధ పడుతున్న వారికి లేదా దానిని నివారించే లక్ష్యంతో వున్న వారికి , ప్రోటీన్లు, ఫైబర్, కాంప్లెక్స్ పిండిపదార్థాలను తీసుకోవడం కీలకం. బాదం వంటి తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాన్ని భోజనంలో చేర్చుకోవడం, చక్కెర తీసుకు వచ్చే చిక్కులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బాదంపప్పులు పోషకమైనవి మాత్రమే కాదు, సంతృప్తికరంగా కూడా ఉంటాయి, అనారోగ్యకరమైన చిరుతిళ్ల కోసం కోరికను అరికడతాయి” అని అన్నారు

యుక్తవయసులో పెరుగుతున్న ప్రీడయాబెటిస్ పరిస్థితి గురించి న్యూట్రిషన్, వెల్నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ.. “భారతదేశంలో ప్రీడయాబెటిస్ యొక్క ప్రాబల్యం పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే వీరిలో అధిక సంఖ్యలో ప్రీడయాబెటిస్ నుండి పూర్తి స్థాయి టైప్ 2 డయాబెటిస్‌కు మారతారు. ఈ సమస్యను తగ్గించడానికి లేదా ఆపడానికి మనం మెరుగైన జీవనశైలి ఎంపికలు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన భోజనంలో భాగంగా బాదంపప్పును చేర్చుకోవడం మనం చేయగల సులభమైన, రుచికరమైన మార్పు” అని అన్నారు.

పోషకాహార నిపుణురాలు అయిన డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ..”భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధాని అనే బిరుదును కలిగి ఉంది. దానిని పోగొట్టుకోవటానికి కొన్ని చర్యలను అమలు చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఈ దిశలో ఒక సులభమైన, సమర్థవంతమైన ముందడుగు రోజువారీ బాదంపప్పులను తీసుకోవడం.ఈ గింజలు చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి నివారణగా తోడ్పడతాయి” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News