Wednesday, January 22, 2025

‘తన రూటే సపరేటు’…!

- Advertisement -
- Advertisement -

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన స్టైల్‌లో మార్పు లేదు….
భట్టితో పాటు, సిఎం రేవంత్‌తో ఫొటోలను పోస్ట్ చేసిన
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఫొటోలు

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏ పనిచేసినా, ఏదీ మాట్లాడినా అది వివాదస్పదం అవుతూనే ఉంటుంది. పార్టీలో తన రూటే సపరేట్ అన్నట్లుగా వెంకట్ రెడ్డి వైఖరి ఉంటుంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన స్టైల్ తనదేనంటూ తన అభిప్రాయలు బయటకు చెబుతుంటారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విట్టర్ ఎక్స్ వేదికగా తాను భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ కొత్త శకాన్ని నిర్మిద్దాం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఇంకేముంది ఇదే అదనుగా సిఎం రేవంత్ ఫొటో లేకుండా భట్టితో వెంకన్న పెట్టిన ట్వీట్‌ను ఆసరాగా చేసుకున్న ప్రత్యర్థి పార్టీలు అదిగో అప్పుడే కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని కామెంట్లతో దండెత్తారు. దీంతో తేరుకున్న వెంకట్‌రెడ్డి మరుసటి రోజు తనతో సిఎం రేవంత్‌రెడ్డి ఉన్న ఫొటోను జతచేస్తూ సలార్ సినిమాలోని పాటను కోడ్ చేస్తూ మేమంతా ఒకటే నంటూ తమ ఐక్యతను చాటుతూ మరో ట్వీట్ పోస్టు చేశారు.

‘వేగమొకడు…. త్యాగమొకడు గతం మరువని గమనమే ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే. ఒకరు గర్జన. ఒకరు ఉప్పెన వెరసి ప్రళయాలే. సైగ ఒకరు సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే’ అంటూ సిఎం రేవంత్ రెడ్డి ఫొటోతో సలార్ మూవీ పాటతో రూపొందించిన వీడియోను ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వెంకట్ రెడ్డి ట్వీట్‌లు కాంగ్రెస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ మారాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News